లోక్‌సభలో ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్

ఢిల్లీ (CLiC2NEWS): పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసినదే. ఈసందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్‌సభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్యానంపై మోడీ మాట్లాడారు. భారత దేశ ప్రథమ పౌరురాలిగా.. ప్రథమ పీఠంపై కూర్చోవడం ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కిందన్నారు. అలాంటి వారిని అవమానించేలా మాట్లాడటం.. ప్రసంగానికి హాజరుకాకపోవడం వంటివి వారిలోని సమర్థత, విద్యేషాలు బయటపడ్డాయని అన్నారు. కరోనా వంటి కష్ట సమాయాల నుండి భారత్ బయటపడగలిగినదని.. కరోనా వ్యాక్సిన్లు ఉచితంగా అందించినందుకు దేశాలన్నీ భారత్‌ను ప్రశంసించాయన్నారు. కొవిడ్ పరిస్థితులను తట్టుకుని భారత్ ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని.. ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయన్నారు. ఇవన్నీ కొందర్నీ బాధిస్తున్నట్లు ఉన్నాయని.. వారు దేశ ప్రగతిని జీర్ణించుకోలేకపోతున్నారని .. అలాంటి వారు ఆత్మ పరీశీలన చేసుకోవాలని మోడీ అన్నారు.
జమ్మూ కశ్మీర్ భారత్ జోడో యాత్ర ముగింపు సభ గురించి ప్రస్తావిస్తూ.. ఇప్పుడు అందరూ జమ్ముకశ్మీర్ వెళ్లొస్తున్నారన్నారు.. ఇదివరకు లాల్ చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడం ఒక కలగా ఉండేదని.. మా ప్రభుత్వ నిర్ణయంతో లాల్‌చౌక్‌లో స్వేచ్ఛగా జెండా ఎగురవేయగలుగుతున్నామన్నారు. గతంలో తీవ్రవాదులు దమ్ముంటే లాల్‌చౌక్‌లో త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలని పోస్టర్లు వేసేవారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ విధానాల కారణంగా మారుమూల ప్రాంతాలకు సైతం అభివృద్ధి అందుతోందని ప్రాధాని అన్నారు.