కాకినాడ: ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం ఏడుగురు మృతి

కాకినాడ (CLiC2NEWS): కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగుంటలోని ఫ్యాక్టరీలో ఆయిల్ ట్యాంకర్‌లో దిగిన ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ట్యాంకును శుభ్రం చేసేందుకు ట్యాంకర్‌లోకి వెళ్లిన ఏడుగురు మరణించారు. ఒకరి తర్వాత ఒకరు దిగి ఊపిరి ఆడక ఏడుగురూ చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. కాగా మృతుల్లో పాడేరు కు చెంది. కుర్రా రామారావు (45), పెచ్చంగి కృష్ణ (35), పెచ్చంగి నరసింహ, పెచ్చంగి సాగర్, కురతాడు జంజిబాబుగా గుర్తించారు. మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు కు చెందిన కట్టమూరి జగదీశ్ ప్రసాద్ గా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.