టి. వేదాంత సూరిః బ‌తుక‌మ్మ పాట‌ను బ‌తికించండి!

కాలం మారుతోంది.. మనుషులు మారుతున్నారు, అలవాట్లు, ఆచారాలు , సంప్రదాయాల్లో మార్పులు వస్తున్నాయి.. బతుకమ్మ పండుగ వచ్చింది.. ఎంగిలి పూలు షురూ అయింది.. యూట్యూబ్ పాటల హోరు పెరుగుతోంది. కానీ ఈ పాటలన్నీ ప్లాస్టిక్ పూల లాగే వున్నాయి.. అసలు సిసలైన పాటలు పల్లె జనాల నోళ్ళలో నానుతున్నాయి.. వాటిని రికార్డు చేయవలసిన అవసరం వుంది. ఆడవాళ్లు తమ సంతోషాలను, బాధలను, జీవన సరళిని పాటల రూపం లో చెప్పుకుని ఆనందించడం అలవాటు.. కానీ డి. జె. పాటల్లో అవేం వుండవు.. తెలంగాణ బిడ్డలం అని చెప్పుకునే కవులు, ఇలాంటివి రాయకుండా పల్లె జనాల నాలుకలపై నర్తించే పాటలు సేకరించి వారిని గౌరవిస్తే బాగుంటుంది.

 

ఐదు దశాబ్దాల క్రితం గ్రామాల్లో పండుగ వాతావరణమే వేరు.. వానా కాలం లో పచ్చని చేలలో నడుస్తూ పూలు సేకరించి.. బతుకమ్మ ను పేర్చి. సాయంకాలం తనివి తీరా అడ్డుకోవడం గ్రామ పడచులకు అలవాటు.. వారిని చూస్తూ వారికీ సహకరిస్తూ. కబుర్లు చెప్పుకోవడం మగవాళ్ల పని. బడి సెలవులు,, కావడం తో ఎక్కడెక్కడో వున్నవారు ఇల్లు చేరుకోవడం, కొత్త బట్టలు, ఫలహారాలు, సీతా ;ఫలాలు , జమ పళ్ళు, మల్లె, మొల్ల, సన్నజాజి, రుద్రాక్ష, గోరింట, నువ్వు పూలు, కట్లపూలు, బంతి, చేమంతి, గుమ్మడి ఇలా ప్రకృతి సోయగమంతా బతుకమ్మ వద్ద వాలిపోతుంది.. తాము మనసారా ప్రేమించే పూలను పూజించడం యెంత గొప్ప సంప్రదాయమో కదా .. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతం లో వుండే తల్లులు పడుకునే బతుకమ్మ పాటలు రికార్డు చేయాలి. వాటికి విశ్వవ్యాప్త ఆదరణ పొందేలా కృషి చేయాలి. యూట్యూబ్ చానళ్ళు అన్ని ఈ పనికి పూనుకోవాలి.. తెలంగాణా పల్లె లోగిళ్ళలో అడుగు పెట్టండి..

Leave A Reply

Your email address will not be published.