యూనివ‌ర్సిటి స్నాత‌కోత్స‌వంలో రాష్ట్రపతి ఉద్వేగ‌ ప్ర‌సంగం..

భువ‌నేశ్వ‌ర్ (CLiC2NEWS): ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్‌లోని ర‌మాదేవి యూనివ‌ర్సిటీ స్నాత‌కోత్స‌వంలో రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము పాల్గొని మెడ‌ల్స్ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ‌త స్మృతుల‌ను గుర్తుచేసుకున్నారు. తాను ఇదే కాలేజీలో విద్య‌న‌భ్య‌సించే రోజుల్లో ఇక్క‌డ ఎటువంటి సౌక‌ర్యాలు లేవ‌ని.. నిమ్మ‌ర‌సం తాగి, ప‌ల్లీలు తిని విద్యార్థులు ఆక‌లి తీర్చుకునేవార‌ని తెలిపారు. చ‌దువుకోసం తాను మ‌యూర్ భంజ్ జిల్లాలోన మారుమూల ఆదివాసీ గ్రామం నుండి భువ‌నేశ్వ‌ర్ వ‌చ్చిపేద‌రికం వ‌ల్ల ఎన్నో ఇబ్బందుల‌కు గ‌రైన‌ట్లు చెప్పారు. ప‌ల్లీలు తినాల‌ని ఉన్నా.. డ‌బ్బులు మిగిల్చుకోవ‌డం కోసం ఆక‌లిని చంపుకొని గ‌డిపిన రోజులున్నాయ‌న్నారు. నేడు మ‌హిళ‌లు- పురుషుల‌తో స‌మానంగా ప్ర‌గతి ప‌థంలో దూసుకెళ్తున్నారని.. పార్ల‌మెంట్‌లో 115 మంది మ‌హిళలు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నార‌న్నారు. ప్ర‌సంగానంత‌రం 22 మంది విద్యార్థుల‌కు గోల్డ్ మెడల్స్‌, ఇద్ద‌రికి పిహెచ్‌డి ప‌త‌కాలు అంద‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.