Kukatpally: పార్కింగ్‌లో ఉన్న మూడు బస్సుల్లో మంటలు!

హైదరాబాద్ (CLiC2NEWS): కూకట్‌పల్లిలోని ఐడిఎల్ చెరువు వద్ద పార్కింగ్‌లో ఉన్న బస్సులకు అర్ధరాత్రి మంటలు అలుముకున్నాయి. పార్కింగ్‌లో నిలిపిన ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.