ఎన్‌టిఆర్ పేరిట రూ.100 వెండి నాణెం ముద్రణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ (CLiC2NEWS): దివంగత నేత, మాజీ సిఎం ఎన్‌టిఆర్ పేరిట రూ.100 వెండి నాణెం ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్ శత జయంత్యుత్సవాల వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మింట్ అధికారులు ఎన్‌టిఆర్ కుమార్తె దగ్గుపాటి పురందేశ్వరి నుండి సలహాలు, సూచనలు స్వీకరించినట్లు సమాచారం. ఈ సందర్బంగా తన తండ్రిగారి పేరిట నాణెం తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు ఆమె తెలిపారు. అధికారులు ఎన్ టిఆర్ 3 ఫోటోలను పరిశీలించారని.. నాణెం రూపకల్పన ప్రొసీజర్‌కు ఒక నెల రోజులు సమయం పడుతుందని వెల్లడించారు.