వైభవంగా కొమురవెల్లి మల్లన్న పెద్దపట్నం

కొమురవెల్లి (CLiC2NEWS): మహాశివరాత్రి సందర్భంగా సిద్దపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శివరాత్రి పర్వదినం కావడంతో కొమురవెల్లికి భక్తులు పోటెత్తారు. ఒగ్గు పూజారులు, అర్చకులు పెద్దపట్నం కార్యక్రమాన్ని రాత్రి 12 గంటలకు ప్రారంభించి తెల్లవారు జాము వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలు తీసుకువచ్చి పట్నం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారు పట్నం దాటిన అనంతరం భక్తులు కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు మల్లన్న కథను చెప్పారు. ఒగ్గు కథను చెబుతూ పూజారులు ఐదు రంగులతో పెద్దపట్నం వేశారు.
