25వేల పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్..
సచిన్ రికార్డు బద్దలు

ఢిల్లీ (CLiC2NEWS): ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లలో అత్యంత వేగంగా 25 వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును సయితం బద్దులు కొట్టాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి కోహ్లీ 25,012 పరుగులు సాధించి.. ఈ మైలురాయిని అందుకున్న ఆరవ క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లీ 549 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించాడు. సచిన్ 577 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. రికి పాంటింగ్ 588 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. విరాట్ కోహ్లీ 106 టెస్ట్ మ్యాచ్‌లలో 8,195, వన్డేలలో 12,809 పరుగులు సాధించగా.. 115 టి 20లలో 4,008 పరుగులు సాధించాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్టేలియా 263 పరుగులు చేయాగా.. భారత్ 262 పరుగురు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కంగారుల జట్టు 113 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు 4 వికెట్లు నష్టానికి 118 పరుగులు చేసి రెండో టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్‌లు మిగులున్నాయి. ఇప్పటికే నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ గెలిస్తే.. ‘ఐసిసి ర్యాంకింగ్స్’లో అగ్రస్థానంలో ఉంటుంది. అదేవిధంగా ‘ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్’ ఫైనల్‌కు వెళ్లేందుకు మార్గంమవుతుంది.