వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్తులు, గవర్నర్ కోటాలో అభ్యర్థుల పేర్లను సోమవారం వైసీపీ ప్రకటించింది. వీరిలో స్థానిక సంస్థల కోటా నుంచి 9 స్థానాలు, ఎమ్మెల్యే కోటా నుంచి 7, గవర్నర్ కోటా 2 స్థానాలు పేర్లను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
సిఎం జగన్ మోహన్‌రెడ్డి సామాజిక న్యాయానికి పెద్దపీటవేస్తూ బిసి, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు స్థానం కల్పించారని పేర్కొన్నారు.
అభ్యర్థుల పేర్లు
- నర్తు రామారావు (శ్రీకాకుళం)
- కుడిపూడి సూర్యనారాయణ (తూర్పుగోదావరి)
- వంకా రవీంద్రనాథ్ (పశ్చిమగోదావరి)
- కవురు శ్రీనివాస్ (పశ్చిమగోదావరి)
- మేరుగు మురళీధర్ (నెల్లూరు)
- సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు)
- పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (కడప)
- ఎ.మధుసూదన్ (కర్నూలు)
- ఎస్.మంగమ్మ (అనంతపురం)
ఎమ్మెల్యేల కోటా..
- పెన్మత్స సూర్యనారాయణరాజు (విజయనగరం)
- పోతుల సునీత (బాపట్ల)
- కోలా గురువులు (విశాఖ)\
- బొమ్మిఇజ్రజాయల్(అంబేద్కర్ కోనసీమ)
- జయమంగళ వెంకటరమణ (ఏలూరు)
- చంద్రగిరి ఏసురత్నం (గుంటూరు)
- మర్రి రాజశేఖర్ (పల్నాడు)
గవర్నర్ కోటా
- కుంభా రవిబాబు (అల్లూరి సీతారామరాజు)
- కర్రి పద్మశ్రీ (కాకినాడ)