మ‌న్యం జిల్లాలో ఆటోను ఢీకొట్టిన లారీ.. న‌లుగురు మృతి

పార్వ‌తీపురం (CLiC2NEWS): మ‌న్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. పెళ్లికి వెళ్లి తిరిగి వ‌స్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్ర‌మాదం కొమ‌రాడ మండ‌లం చోళ ప‌దం వ‌ద్ద బుధ‌వారం మ‌ధ్యాహ‌నం జ‌రిగింది. ఈఘ‌ట‌న‌లో న‌లుగురు మృతిచెందారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఇద్దిరి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌ర‌ణించిన వారు అంటివ‌ల‌స గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.