ఇక నుండి ‘లా నేస్తం’ ఏడాదికి రెండుసార్లు అమలు: సిఎం జగన్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదుల కోసం అమలు చేస్తున్న లా నేస్తం పథకం ఇకనుండి ఏడాదికి రెండు సార్లు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిఆపరు. ప్రభుత్వం బుధవారం 2,011 మంది జూనియర్ అడ్వకేట్‌ల కోసం రూ. 1,00,55,000 లను సిఎం విడుదల చేశారు. ఈ సంర్భంగా సిఎం మాట్లాడుతూ.. గత మూడేళ్లో 4,248 మంది న్యాయవాదులకు లా నేస్తం ద్వారా రూ. 35.40 కోట్లు అందిచామని తెలిపారు. కొత్తగా ఇపుడు 2,011 మందికి లా నేస్తం వారి ఖాతాల్లో జమచేశామన్నారు. ఇక నుండి లా నేస్తం సంవత్సరానికి రెండు సార్తు అందజేస్తామని సిఎం అన్నారు.