వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. బాధ్యుడైన సీనియర్ విద్యార్థి అరెస్టు
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/arrest.jpg)
వరంగల్ (CLiC2NEWS): ఎంజిఎంలో పిజి వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెకు నిమ్స్‌లో చికిత్సనందిస్తున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారకుడిగా భావిస్తున్న సీనియర్ పిజి విద్యార్థి డాక్టర్ సైఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రీతి ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నాడని.. అందరి ముందూ ప్రీతిని అవమానించినట్లు పోలీసులు తెలిపారు. సైఫ్ తనను బ్రెయిన్ లేదంటూ హేళన చేసినట్లు సోషల్ మీడియా చాటింగ్ ద్వారా వెల్లడైందని..అన్ని ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్ట్ చేసినట్లు సిపి మీడియాకు వెల్లడించారు.
వాట్సాప్ గ్రూపులో డాక్టర్ సైఫ్ పెట్టిన మెసేజ్‌పై ప్రీతి పర్సనల్‌గా ప్రశ్నించడంతో.. తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడని స్నేహితులతో చేసిన చాటింగ్‌లో ప్రీతి పేర్కొంది. ఒక వ్యక్తి ఇన్‌సల్ట్‌గా ఫీలయితే అది ర్యాగింగ్ కిందికే వస్తుందని.. ప్రీతినే లక్ష్యంగా చేసి అవహేళన చేసినట్లు చాటింగ్ ద్వారా వెల్లడైంది. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ప్రీతికి చికిత్సనందిస్తున్నారు. గరవర్నర్ తమిళసై, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నిమ్స్‌కి వచ్చి వైద్యులతో మాట్లాడారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు.
తన కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేసినడుడే సీనియర్ విద్యార్థిపై పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రీతి తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంజిఎం ఆస్పత్రిలో పిజి వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!
This excellent website really has all of the information and facts
I wanted concerning this subject and didn’t know who to ask.