కెనడా పౌరసత్వం వదులుకోబోతున్న అక్షయ్ కుమార్
![](https://clic2news.com/wp-content/uploads/2022/04/AKSHAY-KUMAR.jpg)
ముంబయి (CLiC2NEWS): తనకు అన్నీ ఇచ్చిన భారత్ పౌరసత్వాన్ని తిరిగి పొందాలనుకుంటున్నాని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన కెనడా పౌరసత్వాన్ని వదులుకోనున్నట్లు వెల్లడించారు. భారత పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకన్నానని.. అది రాగానే కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటా అని అన్నారు. ఈ సందర్భంగా కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాలు వివరించారు.
1990లలో అక్షయ్ చేసిన దాదాపు 15 సినిమాలు పరాజయం పాలవడంతో తన స్నేహితుడి సలహా మేరకు కెనడా వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆ టైంలో కెనడా పాస్ పోర్ట్ తీసుకున్నానన్నారు. ఆ సమయానికి తాను చేసిన మరో రెండు సినమాలు భారత్‌లో ఘన విజయం సాధించడంతో కెనడా వెళ్లాల్సిన అవసరం రాలేదని.. ఇక్కడే అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలో పాస్ పోర్టు విషయం మరిచిపోయినట్లు వివరించారు.
2017లో ఎక్ ప్రేమ్ కథ సినిమా ప్రమోషన్ల సమయంలో తాను కెనడా పౌరసత్వం కలిగి ఉన్నానన్నారు. దీని గురించి తాను ఎపుడూ దాచాలనుకోలేదన్నారు. 2019వ సంవత్సరంలో ప్రధాని మోడీని అక్షయ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. భారతీయులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆ సమయంలో ఆయనపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఓటు హక్కులేని వ్యక్తి భారత పౌరులను ఓటింగ్‌కు పిలుపివ్వడంపై విమర్శలు ఎదుర్కున్నారు. దీనిపై అక్షయ్ తానెపుడూ కెనడా పౌరసత్వాన్ని దాయాలనుకోలేదని, ఈ ఏడు సంవత్సరాలలో భారత్‌లోనే ఉంటూ ఇక్కడే పన్నులు చెల్లించానని అప్పట్లో వివరణ కూడా ఇచ్చారు.