Warangal: ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లికి ఫోన్ చేసిన ప్రీతి..
వరంగల్ (CLiC2NEWS): ఎంజిఎం లో వైద్యవిద్యార్థిని ప్రీతి హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో వైద్యమందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్యకు యత్నించే ముందు తల్లికి ఫోన్ చేసి.. కాలేజ్‌లో జరుగుతున్న విషయాలను తెలిపినట్లు సమాచారం. ఈ ఫోన్‌కాల్‌కి సంబంధించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. సీనియర్ వైద్య విద్యార్థి అయిన సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని.. సీనియర్లంతా ఒక్కటిగా ఉండటం వలన సైఫ్ వేధింపులు మితిమీరుతున్నాయని తెలిపింది. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకపోయింది. నేను అతడిపూ ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒక్కటై నన్న దూరం పెడతారు. ఏదైనా ఉంటే తన దగ్గరికి రావాలి కానీ ప్రిన్సిపాల్కి ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్ ఒడి నాపై ఆగ్రహం వ్యక్తం చేశారని.. ప్రీతి తల్లితో మాట్లాడింది. నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సైఫ్‌తో నేను మాట్లాడతానని ప్రీతి తల్లి ఆమెతో చెప్పింది.
వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. బాధ్యుడైన సీనియర్ విద్యార్థి అరెస్టు
ఎంజిఎం ఆస్పత్రిలో పిజి వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!