నేడు కామారెడ్డి జిల్లాలో సిఎం కెసిఆర్ ప‌ర్య‌ట‌న‌

కామారెడ్డి (CLiC2NEWS): ముఖ్య‌మంత్రి కెసిఆర్ నేడు కామారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. బాన్సువాడ నియోజ‌క వ‌ర్గం లోని తిమ్మాపూర్‌లో తెలంగాణ తిరుప‌తి దేవ‌స్థానంలో జ‌రుగుతున్న బ్ర‌హ్మోత్స‌వాల‌కు సిఎం హాజ‌ర‌వ‌నున్నారు. సిఎం ప‌ర్య‌ట‌న ఉన్నందున అధికారులు ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. తిమ్మాపురంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మాత్స‌వాలు మూడురోజులుగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మంగ‌ళ‌వారం శాస‌న స‌భాప‌తి పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి దంప‌తులు బ్ర‌హ్మాత్స‌వాల‌లో పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

Leave A Reply

Your email address will not be published.