కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కెటిఆర్ లేఖ..
హైదరాబాద్ (CLiC2NEWS): కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఓట్ల తొలగింపు.. హక్కులను హరించడమే అని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు మంత్రి లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 35 వేల మంది ఓటర్ల పేర్లను జాబితానుండి అక్రమంగా తొలగించారని మంత్రి పేర్కొన్నారు. ఐదు ఏళ్లలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఓటర్ల సంఖ్య తగ్గిందని.. వీరికి ఎన్నికల్లో పాల్గొనే హక్కు కల్పించాలని లేఖలో మంత్రి కోరారు. తొలగించిన 35 వేల ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
కంటోన్మెంట్ పరిధిలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో అక్రమంగా నివసిస్తున్నారన్న కారణంతో, అర్హత కలిగిన వారిని ఓటర్ల జాబితానుండి తొలగించారిని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుండి తొలగించారన్నారు. 75 సంత్సరాలుగా అక్కడ శాశ్వతంగా నివాసాలు ఏర్పరుచుకొన్న కుటుంబాల హక్కులను భంగం కలిగించారని.. అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఓట్ల తొలగించారని ఆయన అన్నారు.