ఆశలన్నీ నిఖత్‌పైనే..
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ వేడుకలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్ తొలి రోజే బరిలోకి దిగుతుంది. ఆమె మరోసారి ప్రపంచ ఛాంపియన్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. 50 కేజిల విభాగంలో ఇస్మాయిలోవా ప్రత్యర్థిని ఓడించి రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది. తొలిరోజే బౌట్‌లోనే ఆధిపత్యం చూపించిన నిఖత్ గెలిచినట్లు ప్రకటించారు. రౌండ్ ఆఫ్ 32లో నిఖతక్ష ఆఫ్రికాకు చెందిన రౌమైసా బౌలమ్‌తో తలపడనుంది.
మరోవైపు లైట్ మిడిల్ వెయిట్ (70కేజీలు)విభాగంలో శ్రతి యాదవ్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు బాక్సింగ్ సమాఖ్య ప్రకటించింది. సనామచ చాను తలకు గాయం అవడంతో చాను స్థానంలో శ్రతిని తీసుకున్నట్లు తెలుస్తొంది. శ్రుతి స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీలో కాంస్యం సాధించింది.