గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో మరో మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు ఎఇఇ, డిఎఒ పరీక్షలను రద్దు చేసింది. ప్రశ్నాపత్రాల (ఎఇ పేపర్) లేకేజి కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను టిఎస్‌పిఎస్‌సి రద్దు చేసింది. ఎఇ పేపర్ మాత్రమే లీకయిందనుకున్న అధికారులకు.. ప్రవీణ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్‌లో ఇంకా కొన్ని పేపర్‌లు ఉన్నట్లు అనుమానంతో.. అతని సెల్‌ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌ను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని ఎఫ్ ఎస్ ఎల్‌కు పంపించారు. ఎఫ్ ఎస్ ఎల్ అధికారులు ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మరికొన్ని ప్రశ్నాపత్రాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్, ఎఇఇ, డిఎఒ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది.
గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ పరీక్ష రాసిన వారిలో 25,050 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఈ ఏడాది జూన్ 5 వ తేదీ నుండి 12 వరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాల్సి ఉంది. పేపర్ లీకేజి ఘటనతో ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయడంతో అంతా తారుమారైపోయింది. కష్టపడి చదివి రాసిన పరీక్ష రద్దు కావడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. రద్దు చేసిన పరీక్షను జూన్ 11వ తేదీన నిర్వహించాలని టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించినట్లు ప్రకటించింది.
[…] గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు.. […]