Secunderabad: మ‌ల్టీలెవ‌ల్ మార్కెటింగ్ మాయాజాలం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): సికింద్రాబాద్‌లోని స్వ‌ప్న‌లోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభ‌వించిన విష‌యం తెలిసిన‌దే.ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మృత్యువాత ప‌డ్డారు. మృతిచెందిన వారు క్యూనెట్  సంస్థ‌లో ఉద్యోగులు. బిఎం5 సంస్థ పేరిట కాల్ సెంట‌ర్ నిర్వ‌హిస్తూ.. అమాయ‌కులైన యువ‌త‌కు భారీ మొత్తాల‌ను ఆశ‌చూపి ఈ సంస్థ‌లోకి తీసుకుంది. సుమారు 40 మందికిపైగా యువ‌త ఈ క్యూనెట్ కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న‌ట్లు గుర్తించారు. ఈ సంస్థ‌లో జాయిన్ అయ్యే ముందు ఒక్కొక్క‌రు రూ. 1.5 నుండి 3 ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లించారు. ముందుగా జాయిన్ అయిన వారు మ‌రో ఇద్ద‌రిని చేర్పిస్తే క‌మిష‌న్ ఇస్తారు. అగ్నిప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారు ఆ సంస్థ‌లో ప‌నిచేసే గ్రూప్ లీడ‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం. వీరంతా మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన వారే. అప్పులు చేసి మ‌రీ సంస్థ‌లో చేరారు. నెల‌కు రూ. 30 వేలు వేత‌నం.. ఏదో రకంగా అప్పులు తీరిపోతాయిలే అని యువ‌త ఈ కంపెనీలో చేరారు. కానీ వారి ఆశ‌లు అడిఆశ‌లైనాయి. ఇలా కంపెనీ చేరి ఆరుగురు త‌మ ప్రాణాలు కోల్పోయారు. మ‌ర‌ణించిన వారు రెండు, మూడు ఏళ్ల నుండి క్యూనెట్‌లో ప‌నిచేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.