కూలిన గోల్కొండ కోట గోడ

పర్యాటకులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం

గోల్కొండః హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. వర్షం తగ్గినా ప‌లుచోట్ల ఇప్ప‌టికీ వరద నీరు మాత్రం తగ్గలేదు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నానిన చారిత్రక గోల్కండ కోటలోని ఓ గోడ కుప్పకూలింది.  కోటలోని శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయం ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోయింది. కొవిడ్‌ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. పది నెలల క్రితం ఇదే గోడపై ధ్వంసమైన బురుజులకు మరమ్మతులు నిర్వహించారు. అప్పటికే ఈ గోడకు పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారినప్పటికీ దానిని పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు కురిసిన భారీ వర్షాలకు అది కాస్తా నాని కుప్పకూలింది. పర్యాటకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

(నేలమట్టమైన సర్దార్ సర్వాయి పాపన్న కోట)

కాగా రెండు రోజుల కింద‌ట 18వ శతాబ్దంలో రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్‌ గ్రామంలో పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న కట్టిన కోట నేలమట్టం అయిన విష‌యం తెలిసిందే.. ఈ ఘ‌ట‌న‌లో కోట కింద నాలుగు ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదాన్ని ముందే గమనించిన స్థానికులు ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీశారు దాంతో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు.

Leave A Reply

Your email address will not be published.