దేశంలో 2 వేలు దాటిన కొవిడ్ కేసులు

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కొవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఒక్క‌రోజులో న‌మోదైన కొవిడ్ కేసులు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా 2,151 క‌రోనా కేసులు నిర్ధార‌ణ అయిన‌ట్లు బుధ‌వారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. గడిచ‌ని ఐదు నెల‌లకాలంలో రోజువారీ కేసులు 2వేలు పైన న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,42,497 మంది నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..2 వేల మందికి పైగా నిర్ధార‌ణ‌య్యింది. గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌ర్‌లో 2,208 కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇదే మొద‌టిసారి.

Leave A Reply

Your email address will not be published.