పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులకు పరీక్ష సెంటర్లకు 9.35 వరకు మాత్రమే అనుమతించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను ఆర్టీసీ బస్సుల్లో చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చిని తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుండి 13వ తేదీ వరకు కొనసాగుతాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా పరీక్షలకు సిద్దం కావాలని మంత్రి సూచించారు.