పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య!

గుంటూరు (CLiC2NEWS): జిల్లాలోని చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద ఓ యు జంట ఆత్మహత్య చేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో రైలుకింద పడి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెలపాడు గ్రామానికి చెందిన శ్రీకాంత్.. అదే గ్రామానికి చెందిన త్రివేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్రివేణి కాలేజీకి వెళ్లిన అనంతరం శ్రీకాంత్‌తో వెళ్లడం గమనించిన స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో వారు చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సుద్దపల్లి రైల్వేగేటు వద్ద మృతదేహాలు లభ్యమయ్యాయి. త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడికి చేరుకొని మృత దేహాలను పరిశీలించి.. తమ కుమార్తె మృతి చెందినట్లు నిర్ధారించుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.