ఉప్పల్ స్టేడియంలో 7 ఐపిఎల్ మ్యాచ్‌లు..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడనున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత నగరంలో ఐపిఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఆదివారం సన్‌రైజర్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. నాగోల్-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి అధిక సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.