కంచే చేను మేస్తే..! స్టేషన్‌లో దొంగతనం చేసింది పోలీసులే..
కర్నూలు (CLiC2NEWS): కంచే చేను మేస్తే అన్నట్లుగా రక్షణగా ఉండాల్సిన పోలీసులే దొంగలుగా మారి స్టేషన్‌లోని సొమ్మును కాజేశారు. ఈ ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. ఓ కేసులో స్వాధీనం చేసుకున్న సొమ్మును పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆ సొమ్మును పోలీసులే చోరిచేసినట్లు ఎస్‌పి సిద్దార్థ్ కౌశల్ మీడియాకు వివరించారు. 2021 జనవరి 27వ తేదీన తమిళనాడు వ్యాపారి భారతిగోవింద్‌రాజ్ ఎలాంటి పత్రాలు లేకుండా 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదు రవాణా చేస్తుండడా.. పోలీసులు సీజ్ చేసి కర్నూలు తాలుకా అర్బన్ పోలీసు స్టేషన్‌లో భద్రపరిచారు. అదే స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ చోరీ చేసినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 81.52 కిలోల వెండి, రూ. 10 లక్షల నగదును రికవరీ చేసినట్లు తెలిపారు. వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి తెలిపారు.