భారీ హిమపాతం కారణంగా సిక్కింలో ఏడుగురు మృతి!

గాంగ్‌టక్ (CLiC2NEWS): సిక్కింలోని నాథూలా పర్వత లోయ ప్రాంతంలో మంగళవారం భారీ హిమపాతం సంభవించింది. భారీ హిమపాతం కారణంగా ఏడుగురు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గాంగ్‌టక్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందస్తున్నారు. ప్రమాద సమయంలో దాదపు 150 మంది పర్యాటకులు అక్కడున్నట్లు సమాచారం. అనేక మంది పర్యటకులు హిమ పాతం కింద చిక్కుకుపోయారు. సహాక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 22 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. రోడ్లపైన ప్రయాణించే వాహనాలు కూడా మంచులో చిక్కుకుపోయినాయి. సహాయక సిబ్బంది 350 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.