CRPF: భారీగా కానిస్టేబుల్ పోస్టులు.. మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/CRPF-POSTS.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): నిరుద్యోగులకు కేంద్ర హోంశాఖ శుభవార్తనందించింది. సిఆర్‌పిఎఫ్‌లో దాదాపు 1.30లక్షల కానిస్టేబుల్ (జనరల్‌డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం అమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. దీనిలో మాజీ అగ్ని వీరులకు 10% రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు 1,25,262 పోస్టులకు, మహిళలు 4,667 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 23 ఏళ్లకు మించరాదు. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంది. ఒబిసిలకు మూడేళ్ల సడలింపు ఉంది. వేతన శ్రేణి రూ. 21,700 నుండి 69,100 వరకు ఉంది. మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది.