తమిళంపై వివక్ష చూపద్దు.. కేంద్ర హోంమంత్రికి స్టాలిన్ లేఖ
![](https://clic2news.com/wp-content/uploads/2021/05/Stalin.jpg)
చెన్నై (C LiC2NEWS): సెంట్రల్ పోలీస్ రిక్రూట్ మెంట్ టెస్ట్ () తమిళ అభ్యర్థుల ప్రయోజనాలకు విరుద్దంగా ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. ఈ మేరకు సిఎం స్టాలిన్ కేంద్ర మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. కేంద్రం తమిళంపై వివక్ష చూపకూడదని ఆయన అన్నారు. టెస్ట్‌లో తమిళం ను చేర్చలేదని నిలదీశారు. పరీక్షను ఇంగ్లీష్, హిందీలో మాత్రమే రాయాల్సి ఉండంటం.. వివక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు.
సిఆర్‌పిఎఫ్ టెస్ట్‌లో 100 మార్కులలో 25 మార్కులు హిందీ ప్రాథమిక అవగాహన కోసం కేటాయించడం.. హిందీ మాట్లాడే వారికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగదాలలో చేరాలనుకునే తమిళులను నిరోధించినట్లవుతుందని, ఇది రాజ్యాంగ హక్కుకు విరుద్ధమని స్టాలిన్ పేర్కోన్నారు. దీని విషయంలో హోం మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖ ద్వారా సిఎం కోరారు. తమిళంతో సహా అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహించాలని ఆయన కోరారు. సిఆర్‌పిఎఫ్‌లోని పోస్టులలో 579 మందిని తమిళనాడు నుండి భర్తీ చేయనున్నారు.
[…] […]