అది ఒక్క రాజమౌళికే సాధ్యం: మంత్రి తలసాని
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/A-great-honor-for-Oscar-winners.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు గాను సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌కు ఆస్కార్ వరించిన సంగతి తెలిసిందే. వీరిరువురిని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆదివారం ఘనంగా సత్కరించింది. నగరంలోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సినిమా 24 విభాగాలకు చెందిన పలువురు ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
మంత్రి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ.. ఒక సినిమాకి నంది అవార్డు వచ్చినపుడు ఎంతగానో సంతోషిస్తాం. అలాంటిది ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ టీమ్‌కు అభినందనలు తెలిపారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ఏదైనా సాధించాలంటే.. అది ఒక్క రాజమౌళికే సాధ్యమని అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో కీరవాణి మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ లోని పాటకు ఆస్కార్ రావడం.. రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ కృషే ప్రధాన కారణమన్నారు. ఈ వేడుక సందర్భంగా చిత్ర పరిశ్రమంతా ఒకే చోట కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను తొలి పాట రికార్డయిన చెన్నైలోని ప్రసాద్ 70 ఎం.ఎం. థియేటర్ దేవాలయంలా ఉంటుందన్నారు. అక్కడ సాంగ్ కంపోజ్ చేసిన అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేనిదని ఈసందర్భంగా కీరవాణి గుర్తుచేసుకున్నారు. ఒక సారి రామోజీరావుని కలిసినపుడు మీరు ఆస్కార్ తీసుకురండన్నారు. దానికి నేను ఎంతగానో ఆశ్చర్యపోయా.. ఆయన కోసమైనా ఆస్కార్ రావాలనుకున్నా అని తెలిపారు.