మాజీ ఎంపి పొంగులేటి, మాజి మంత్రి జూప‌ల్లిపై స‌స్పెన్ష‌న్‌ వేటు

హైద‌రాబాద్ (CLIC2NEWS): పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారంటూ.. మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిని బిఆర్ ఎప్ పార్టీ స‌స్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాల‌యం స్ప‌ష్టం చేసింది. పొంగులేటి గ‌త కొంత‌కాలంగా కెసిఆర్‌, బిఆర్ ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అదేవిధంగా  జూప‌ల్లి కృష్ణారావు పార్టీపై అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల ఆయ‌న బ‌హిరంగంగానే రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. మంత్రి కెటిఆర్ సైతం ఆయ‌న‌తో మాట్లాడినా ఫ‌లితం లేక‌పోయింది. కొద్ది రోజులుగా నిర్వ‌హిస్తున్న ఆత్మీయ స‌మావేశాల పేరుతో పొంగులేటి త‌న వ‌ర్గం నేత‌ల‌తో భేటీ అవుతున్నార‌ని.. ఆ స‌మావేశాల్లో సిఎం కుటుంబంపై విమ‌ర్శ‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి బిఆర్ ఎస్ స‌స్పెండ్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.