నీట్ దరఖాస్తులకు మరో మూడు రోజుల గడువు పొడిగింపు
![](https://clic2news.com/wp-content/uploads/2021/05/Doctor.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష దరఖాస్తు గడువును మరో మూడు రోజులు పొడిగించారు. దేశ వ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు యూజి నీట్ 2023 దరఖాస్తుల గడువు ఈ నెల 6వ తేదీతో ముగిసింది. కానీ కొందర విద్యార్థులు నుండి విజ్ఞప్తుల మేరకు మూడు రోజులు ( ఏప్రిల్ 11,12,13) అవకాశం ఇస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. నీట్ పరీక్ష మే 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.20 వరకు జరుగుతుంది. ఇంగ్లీష్ , హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు.