టిఎమ్సి, సిపిఐ, ఎన్‌సిపి ల జాతీయ హోదా రద్దు..!
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/EC-WITHDRAW-NATIONAL-PARTY-STATUS.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): తృణమూల్ కాంగ్రెస్, సిసిఐ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ల జాతీయ హోదాను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కి జాతీయ హోదాను కల్పించింది. వీటితో పాటు యుపిలోని ఆర్ ఎల్ డి, మణిపూర్‌లో పిడిఎ, పుదుచ్చేరిలోని పిఎంకె, పశ్చిమ బెంగాల్లో ఆర్ ఎస్పి, మిజోరాంలో ఎంపిసిలకు ఇచ్చిన రాష్ట్ర పార్టీ హోదాను కూడా కమిషన్ రద్దు చేసింది.
అంతేకాకుండా ఎపిలో బిఆర్ ఎస్ రాష్ట్ర పార్టీ హోదాను ఎన్నికల సంఘం తొలగించింది. తెలంగాణలో మాత్రమే బిఆర్ ఎస్‌కు రాష్ట్ర పార్టీగా గుర్తింపు లభించింది. దేశ వ్యాప్తంగా సార్వత్రికల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని పార్టీల జాతీయ హోదాను రద్డు చేయడం గమనార్హం.