సిఆర్ (కల్యంపూడి రాధాకృష్ణ) రావుకు అత్యున్నత పురస్కారం
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/CALVAPUDI-RADHA-KRISHNA.jpg)
వాహింగ్టన్ (CLiC2NEWS): భారతీయ-అమెరికన్ అయిన కల్యంపూడి రాధాకృష్ణ రావు నోబెల్ బహుమతికి సమానమైన గణాంక పురస్కారం అందుకోనున్నారు. స్టాటిస్టిక్స్ రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు గాను ఈ అవార్డు వరించింది. 75 సంవత్సరాల క్రితం ఆయన చేసిన కృషి ఫలితంగా ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. ఇంటర్నేషనల్ ఫ్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కెనడాలోని అట్టావాలో సిఆర్ రావు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
సిఆర్ రావుకు ప్రస్తుతం 102 సంవత్సరాలు. ఆయన 1920 సెప్టెంబర్ 10న బళ్లారిలో జన్మించారు. ఆయన బాల్యం, చదువు అంతా ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎమ్మెస్సీ మాథ్స్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కత్తాలో ఎంఎ స్టాటిస్టిక్స్ చేశారు. 1948లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో పిహెచ్డి పట్టా పొందారు. ఆయన సేవలు కేవలం స్టాటిస్టిక్ రంగానికే కాక, ఎకనమిక్స్, జెనెటిక్స్, ఆంత్రపాలజి తదితర రంగాలకు విశేషమైన సేవలందించారు. ఆయన 19 దేశాల నుండి 39 డాక్టరేట్లు అందుకున్నారు. ఇప్పటి వరకూ 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. యుకె ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ బయోమెట్రిక్ సొసైటికి అధ్యక్షుడిగా పని చేశారు. 100వ పుట్టినరోజు జరుపుకున్నానంతరం కూడా అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ బఫెలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.