దేవుడు చెప్పాడంటూ.. మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో రాజేంద్ర‌న‌గ‌ర్ ప్రాంతంలో ఓ మ‌హిళ కిరోసిన్ పోసుకొని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిథిలోని అత్తాపూర్‌లో ఓ మ‌హిళ రోడ్డుపైకొచ్చి దేవుడు చెప్పాడంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆమెను పోలీసులు అంబులెన్సులో ఎక్కించి ఉస్మానియాకు త‌ర‌లించారు. మ‌హిళ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు పోలీస‌లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.