దారుణం.. షేక్‌పేటలో కారెంట్షాక్తో ముగ్గురు యువకుల మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): నంగరంలోని షేక్‌పేటలో దారుణం చేటుచేసుకుంది. విద్యుద్ఘాతంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనస్, రిజ్వాన్ అన్నదమ్ములు. అసన్ మోటార్ స్విచ్ వేస్తుండగా కారెంట్ షాక్‌కు గురయ్యాడు. అతనిని రక్షించేందుకు రిజ్వాన్ ప్రయత్నించగా అతను కూడా విద్యుద్ఘాతానికి గురయ్యాడు. వీరిని రక్షించబోయిన స్నేహితుడు రజాక్ కూడా ప్రమాదవ శాత్తూ షాక్‌కు గురయ్యాడు. ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.