‘దసరా’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
హైదరాబాద్ (CLiC2NEWS): నాని నటించిన చిత్రం దసరా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
డియర్ నాని, కంగ్రాట్స్ దసరా చూశాను ధరణి పాత్ర కోసం సిద్ధమైన తీరు.. నటనతో అదరగొట్టేశావు అంటూ.. దరసరా టీమ్ మొత్తానికి నా అభినందనలు తెలిపారు. తొలి చిత్రమైన శ్రీకాంత్ ఓదెల అద్భుతంగా చేశాడంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి నాని స్పందిస్తూ.. మీ రెప్పటికీ మెగాస్టారే సర్. కేవలం నటుడిగా మాత్రమే కాదు. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరి కోసం నిలబడే మంచి మనసు కలిగినందుకు మీరు మెగాస్టార్ అని అన్నాడు. ఇంకా శ్రీకాంత్ ఓదెల సంతోషంతో దాయి దాయి దామ్మా స్టెప్ వేస్తున్న తన చిన్ననాటి ఫోటో షేర్ చేశాడు.
ఇక మార్చి 30న విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకున్న దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.