బంజారాహిల్స్ డిఎవి స్కూల్ ఘటన.. ప్రిన్సిపల్ కార్ డ్రైవర్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష
![](https://clic2news.com/wp-content/uploads/2023/03/JUDGEMENT.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): అభం శుభం తెలియని ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. బంజారాహిల్స్ డిఎవి స్కూల్లోని ఎల్‌కెజి విద్యార్థిని లైంగిక దాడి కేసులో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు డ్రైవర్ రజనీకుమార్‌ను దోషిగా తేల్చింది. అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో స్కూల్ ప్రిన్సిపల్‌ని నిర్దోషిగా తేల్చింది. ప్రిన్సిపాల్ కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రజనీకుమార్ గత ఏడాది అక్టోబర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతనిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం డ్రైవర్‌ను దోషిగా తేల్చి.. 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది.