ఎన్‌టిపిసి లిమిటెడ్‌లో 66 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ..
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/ASSISTANT-MANEGER-POSTS.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్‌టిపిసి లిమిటెడ్‌లో పలు విభాగాల్లోని అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ ఎరెక్షన్ విభాగంలో 12 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, మెకానికల్ ఎరెక్షన్‌లో 30, సివిల్ కన్‌స్ట్రక్షన్‌లో 24 పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికలన భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బిఇ బిటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్న వారు అర్హులు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లకు మించరాదు. నెలకు రూ.60,000 నుండి రూ. 1,80,000 జీతం ఉంటుంది. అభ్యర్థులను స్క్రీనింగ్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికి జరుగుతుంది. దరఖాస్తు దారులు రూ. 300 చెల్లించాలి. ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.