ఆరోపణలు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా: సిఎం మమత
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/WEST-BENGAL-CM-MAMTA.jpg)
కోల్‌కతా (CLiC2NEWS): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ పేరు మాత్రం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ గానే ఉంటుందిని స్పష్టం చేశారు. తమ పార్టీ జాతీయ హోదా విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫోన్ చేసినట్లు నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని సిఎం మమత అన్నారు.
ఇటీవల తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, ఎన్‌సిపిల జాతీయ హోదాను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అమిత్ షాకు ఫోన్ చేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారని.. బిజెపి నేత, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి వ్యాఖ్యానించడంతో ఈ విధంగా స్పందించారు.