34 మంది బాల కార్మికులను రక్షించిన రైల్వే పోలీసులు
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/KAJIPET-RAILWAY-STATION.jpg)
కాజిపేట (CLiC2NEWS): బీహార్ నుండి అక్రమంగా రవాణా చేస్తున్న 34 మంది బాల కార్మికులను రైల్వే పోలీసులు కాపాడారు. ముందుగా వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన బాలల పరిరక్షణ విభాగం, శిశు సంక్షేమం శాఖ అధికారులు, రైల్వే పోలీసులు సమన్వయంతో కాజిపేట రైల్వేస్టేషన్‌లో అక్రమంగా తరలిస్తున్న బాల కార్మికులను పట్టుకున్నారు. బీహార్ ఝార్ఖండ్ రాష్ట్రాలనుండి పిల్లల్ని పనుల కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పక్కా ప్రణాళికతో ఈ అక్రమ రవాణాను అడ్డుకోగలిగారు.
సిరిపూర్ ఖాగజ్‌నగర్‌లో మరో 30 మంది బాల కార్మికులను గురువారం రైల్వే అధికారులు పట్టుకున్నారు. వీరంతా యుపి, ఒడిశా నుంచి వేరు వేరు రైళ్లలో వచ్చారు. వీరందరనీ స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. త్వరలో వారి చిరునామాలు తెలుసుకొని స్వస్థలాలకు పంపనున్నట్లు సమాచారం.