ఎపిలో అంగన్వాడి వర్కర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్: సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న అంగన్ వాడి వర్కర్లు, హెల్పర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిఎం జగన్ ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను సిఎం ఆదేశించారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షంచే పరికారాలను అంగన్వాడీల్లో ఉంచాలని.. గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్ వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిఎం అదేశించారు. అంతే కాకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీను కూడా పూర్తి చేయాలని సిఎం అన్నారు.