రాజధాని నిర్మాణం కోసం ఉంచిన భారీ సామాగ్రి అగ్నికి ఆహుతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/FIRE-ACCIDENT-IN-GUNTUR-DIST.jpg)
గుంటూరు (CLiC2NEWS): జిల్లాలోని నెక్కల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజధాని నిర్మాణ కోసం భారీ ఎత్తున పాస్టిక్ పైపులు, కాలువల కోసం తీసుకొచ్చిన పైపులు నిల్లవుంచారు. దాదాపు నాలుగు సంవత్సరాలు గడుస్తుండటంతో వాటికి తేనెతెట్టలు పెరిగాయి. దీంతో తేనె కోసం వచ్చిన వ్యక్తులు పొగబెట్టినట్లు సమాచారం. మంటలు పైపులకు అంటుకునని క్షణాల్లో పైపులు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సైతం మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. నష్టం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.