టిఎస్‌పిఎస్‌సిలో పది కొత్త పోస్టులు మంజూరు
హైదరాబాద్ (CLiC2NEWS): టిఎస్‌పిఎస్‌సిలో పది కొత్త పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాల లేకేజీ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమిషన్‌లో పది కొత్త పోస్టులను మంజూరు చేసింది. పరీక్షల కంట్రోలర్, డిప్యూటి కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటి ఆఫీసర్ , సీనియర్, జూనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ , జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులు,జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో లా ఆఫీసర్ పోస్టులకు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఈ కొత్త పోస్టులను ఆమోదం తెలిపింది. టిఎస్‌పిఎస్ సి అదనపు కార్యదర్శిగా ఐఎఎస్ అధికారి బి.ఎం సంతోష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.