గంగమ్మ పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ (CLiC2NEWS): గంగానది పుష్కరాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ప్రతి 12 ఏండ్లకు ఒకసారి వచ్చే గంగానది పుష్కరాలుఈ నెల 22న ప్రారంభమవుతున్నాయి. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి దేశ నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్, ప్రయాగ్ రాజ్, వారణాసి మీదుగా రక్సోల్ వరకు ఒక ప్రత్యేక రైలు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఈనెల 23,30, వచ్చే నెల 7వ తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అదేవిధంగా తిరుపతి, ప్రయాగ్ రాజ్, వారణాసి మీదుగా దానాపూర్ వరకు మరో ప్రత్యేక రైలు , గుంటూరు, ప్రయాగ్ రాజ్, మీదుగా బెనారస్ వరకు ఇంకో రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపారు. ఈ రెండూ రైళ్లు ఈ నెల 22,29, మే 6 తేదీల్లో అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.