88 మంది జలమండలి ఉద్యోగులకు పదోన్నతులు
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలిలో వివిధ విభాగాల్లో జనరల్ పర్పస్ ఎంప్లాయిస్ (జీపీఈ) గా పనిచేస్తున్న 88 మంది ఉద్యోగులకు పదోన్నతి లభించింది. విద్యార్హతలను బట్టి.. 58 మందికి ఎస్పీఈలుగా (యుటిలిటీ బ్రాంచ్), 25 మందికి ఎస్పీఈలుగా (ఎలక్ట్రికల్ బ్రాంచ్), ముగ్గురికి ఆఫీసర్లుగా (పీఅండ్ఏ), మరో ఇద్దరికి ఆఫీసర్లుగా (ఎఫ్అండ్ఏ) పదోన్నతి కల్పించారు. వీరికి గోషామహల్ లోని జలమండలి కార్యాలయంలో సీజీఎంలు వినోద్ భార్గవ, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ నియామక పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హతలను గుర్తించి, వారికి పదోన్నతి కల్పించినందుకు బోర్డు యాజమాన్యానికి, ప్రత్యేకంగా ఎండీ దానకిశోర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమోషన్లు పొందిన వారు ప్రజలకు మంచి సేవలందించి, బోర్డు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీజీఎం ఆనంద్ నాయక్, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెండ్లు అక్తర్, లక్ష్మినారాయణ, జనరల్ సెక్రటరీ జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.