టిఎస్పిఎస్సి ఎఇఇ సివిల్ పరీక్ష ఆన్లైన్లో..
హైదరాబాద్ (CLiC2NEWS): అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) నియామక పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని టిఎస్పిఎస్సి నిర్ణయించింది. జనవరి నెలలో నిర్వహించిన ఎఇఇ నియామక పరీక్ష.. పేపర్ లేకేజీ కారణంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్త పరీక్ష తేదీలను కమిషన్ తాజాగా ప్రకటించింది. మే 8వ తేదీన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్.. మే 9వ తేదీన అగ్రికల్చర్ , మెకానికల్ ఎఇఇ లతో పాటు సివిల్ ఎఇఇ పరీక్ష కూడా ఆన్లైన్లో నిర్వహించనున్నారు. మే 21, 22 తేదీల్లో రెండు షిప్టుల్లో సివిల్ ఎఇఇ పోస్టులకు పరీక్షలు జరుగుతాయి. తుది స్కోరు ఖరారులో నార్మలైజేషన్ పద్ధతిని పాటించాలని కమిషన్ నిర్ణయించింది.