సెల్ఫీ తీసుకుంటూ.. హెలికాప్టర్ రెక్కలు తగిలి ప్రభుత్వాధికారి మృతి
డెహ్రాడూన్ (CLiC2NEWS): హెలికాప్టర్ రెక్కలు తగిలి ఓ ప్రభుత్వ అధికారి మృతి చెందాడు. ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ఫైనాన్షియల్ కంట్రోలర్ జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం కేదార్నాథ్ చేరుకున్నారు. ఆయన హెలికాప్టర్ ముందు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా.. హెలికాప్టర్ రెక్కలు ఆయనకు బలంగా తగిలడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ యాత్ర కోసం 16 లక్షల మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 25వ తేదీన కేదార్ నాథ్.. 27వ తేదీన బద్రీనాథ్ ఆలయాలను తెరవనున్నారు.