రేపు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు మే, జూన్ నెల కోటా విడుదల
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/ttd-devotees-traffic.jpg)
తిరుమల (CLiC2NEWS): రేపు తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. మే, జూన్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రకటనలో తెలిపింది. భక్తులు గమనించి మంగళవారం ఉదయం 10 గంటల నుండి టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి సూచించింది. టిటిడి అధికారికి వెబ్‌సైట్https//tirupathibalaji.ap.gov.in/ లో బుక్‌చేసుకోగలరు.
నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని కోరారు. టికెట్ల కోసం మొబైల్ యాప్ TTDevasthanams ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.