పిడుగుపాటుతో కుటుంబంలోని న‌లుగురు మృతి

మ‌హ‌దేవ్‌పూర్ (CLiC2NEWS): రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాల‌లుతో కూడాన వ‌ర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల పిడుగులు ప‌డ్డాయి. పిడుగ‌పాటుకు గురై ఒకే కుటుంబంలోని న‌లుగురు మృత్యువాత ప‌డ్డారు. రాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన మ‌హారాష్ట్రలోని గ‌డ్చిరోలి జిల్లాలో కురుస్తున్న వ‌ర్షానికి చెట్టుకింద నిల్చున్న ఇద్ద‌రు చిన్నారులు స‌హా భార్యాభ‌ర్త‌లు మృతి చెందారు. వివాహ వేడుక‌కు హాజ‌రై ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తున్న వారు వర్షానికి చెట్టుకింద నిల్చుని ఉండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది.

Leave A Reply

Your email address will not be published.