పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక దళం కార్యాలయంలో భారీ పేలుడు..
ఇస్లామాబాద్ (CLiC2NEWS): పాక్‌లోని ఉగ్రవాద నిరోధక దళం ఆఫీస్‌లో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ప్రమాదంలో 17 మంది పోలీసులు మృతి చెందారు. పేలుడు పదార్థాలు భద్రపరిచిన గదిలో పేలుళ్లు సంభవించాయి. భవనం మొత్తం పూర్తిగా నేలమట్టమైంది. ఈ ప్రమాదానికి ఉగ్రవాద ప్రమేయం లేదని.. విద్యుద్ఘాతానికి గురై ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన వారిలో పోలీసు అధికారులు ఉన్నారు. దాదాపు 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన ప్రాంతం ఆఫ్గాన్ సరిహద్దులకు సమీపంలో ఉంది. ఇక్కడ పాకిస్థానీ తాలీబాన్ గ్రూపు చాలా సార్లు పోలీసులపై బాంబు దాడులు నిర్వహించారు. కానీ వాటికి సంబంధించిన బాధ్యత స్వీకరించలేదు.